క్రీడాకారుల అభివృద్దే నా లక్ష్యం.
విశ్రాంత అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్.
బెల్లంపల్లి జోర్దార్ ప్రతినిధి:
బెల్లంపల్లి పట్టణంలోని ఆసక్తిగల క్రీడాకారులందరికి, క్రీడారంగంలో తగిన శిక్షణ ఇచ్చి అభివృద్ధి చెందడానికి, తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, క్రీడాకారుల అభివృద్దే నా ధ్యేయమని విశ్రాంత అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్ అన్నారు.
శుక్రవారం స్థానిక తిలక్ స్టేడియం లో తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన బోర్ వెల్ ను, ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు, క్రీడాకారులకు సింగరేణి యాజమాన్యం కానీ మున్సిపల్ వారు కానీ, ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా క్రీడాకారులకు నీటి వసతకల్పించలేకపోయారని, నీటి వసతి లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గమనించి తన సొంత ఖర్చులతో బోర్వెల్ వేసి నీటి వసతి కల్పించాలని అన్నారు.
స్టేడియాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి అధికారులతో మాట్లాడి మరిన్ని వసతులు కల్పించడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా గ్రౌండ్ కు ప్రాక్టీస్‌కు వచ్చే క్రీడాకారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారుడు యాదన్ల నరసయ్య, రత్నం ఐలయ్య, బలరాం, న్యాయవాది చేను రవికుమార్, డాన్స్ మాస్టర్ గోపి, జిమ్ మురారి రావు, తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply