*నూతన ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన సునీత రాణి*
భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి
భీమదేవరపల్లి మండలం నూతన ఎంఈఓ గా నియామకమైన ఎం.సునీత రాణి నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్తకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిహెచ్ఎం గా పనిచేసిన ఈమె ఇప్పటివరకు మండల నోడల్ విద్యాధికారిగా పనిచేశారు. మండల విద్యా వనరుల కేంద్రంలో నేడు మాజీ ఎంఈఓ వెంకటేశ్వరరావు నుండి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సునీత రాణి మాట్లాడుతూ.. అత్యంత సుదీర్ఘకాలం నుండి స్థానిక మండలంలో జిహెచ్ఎం గా కొనసాగుతున్న పరిస్థితులలో నేడు ఎంఈఓ గా నూతన బాధ్యతలు స్వీకరించాల్సి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే తన విధి నిర్వహణలో అందరూ సహకరించాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు శ్రీనివాసరెడ్డి, సునీత , రాజేందర్ రెడ్డి , సురేందర్ రెడ్డి టీపిటిఎఫ్ నాయకులు కొమురయ్య,బిక్షపతి ,రాజేంద్రం జిహెచ్ఎంలు ప్రభాకర్, రమాదేవి, ప్రభావతి కార్యాలయ సిబ్బంది మహేందర్, రాజన్ నాయక్ హిమ సాగర్ మరియు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Leave a Reply