Advertisement

విజయవంతంగా సాగిన జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్

*జాతిని తీర్చిదిద్దడంలో సామాజిక శాస్త్రాలు కీలకం : డిఈఓ వాసంతి*

హనుమకొండ జోర్దార్ ప్రతినిధి

తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో తి.తి.దే. కళ్యాణమండపం లో  ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన జిల్లాస్థాయి సాంఘిక శాస్త్రం ప్రతిభా పాటవ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ఆవిష్కరించి హనుమకొండ జిల్లా విద్యాధికారి శ్రీమతి డి వాసంతి పోటీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిఇఓ వాసంతి మాట్లాడుతూ… విద్యార్థులు శాస్త్ర విజ్ఞాన అంశాలతో పాటు సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసి మంచి పౌరులుగా రూపొందాలని కోరారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు నిత్యం వార్తాపత్రికలు చదువుతూ, సమకాలీన సామాజిక అంశాల పట్ల అవగాహన పెంచుకొని పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత చెంది ఉన్నత ఉద్యోగాలలో ఎంపికై ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.
జిల్లాలోని 120 ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 360 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు.


గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ , గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సహకారంతో తెలంగాణ స్టేట్ సోషల్ ఫోరం ప్రతి సంవత్సరం పదో తరగతి చదివే విద్యార్థులకు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు.
జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటరామిరెడ్డి సి ఎస్ గా వ్యవహరించి ఓఎమ్ఆర్ షీట్లతో ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష తరహాలో సోషల్ టాలెంట్ టెస్ట్ పకడ్బందీగా నిర్వహించారు.
ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసి మాట్లాడుతూ.. విద్యార్థులు మరింత సాధన చేసి రాష్ట్రస్థాయిలో రాణించాలని కోరారు.


వ్యక్తిత్వ వికాస నిపుణులు మురళీధర్ విద్యార్థులకు, ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కొని ఉన్నత విజయాలను సాధించే చిట్కాలను బోధించారు.
సాంఘిక శాస్త్రం విషయ నిపుణులు స్టేట్ రిసోర్స్ పర్సన్ ధూపటి నవీన్ కుమార్, విద్యార్థులు పబ్లిక్ పరీక్షలో సోషల్ సబ్జెక్టులో పది జీపీఏ మార్కులు సాధించే పద్ధతులను మరియు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అవకాశాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ ఎంఈఓ నెహ్రు నాయక్, సోషల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకటేశ్వర్లు, కోశాధికారి రాధాకృష్ణ చారి ,హనుమకొండ సోషల్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ ప్రకాష్ తో పాటు ఫోరం బాధ్యులు జయ, రేవతి, వెంకటయ్య, అశోక్ కుమార్, రాచర్ల శ్రీనివాస్, శ్రీదేవి, సుజాత,నరసింగరావు , తదితరులు పాల్గొన్నారు.
తెలుగు, ఇంగ్లీష్ మీడియం మరియు రెసిడెన్షియల్ విభాగాలలో విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీకి ఎన్నికైన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

*రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికైన విద్యార్థులు*

జిల్లా పరిషత్ మరియు ప్రభుత్వ పాఠశాలల *ఇంగ్లీష్ మీడియం* విభాగంలో ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఈ అనూష ప్రథమ స్థానం, ఆత్మకూరు మండలం అక్కంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన వై సాయిచంద్ ద్వితీయ స్థానం ,కమలాపూర్ మండలం గూడూరు పాఠశాలకు చెందిన టి.సిద్ధార్థ తృతీయ స్థానం గెలుపొందారు. తెలుగు మీడియం విభాగంలో నడికుడ మండలం కౌకొండ ఉన్నత పాఠశాలకు చెందిన పి. సాయి తేజ ప్రథమ స్థానం,పర్కాల బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన జీ రవితేజ, ఎ.వినయ్ ద్వితీయ తృతీయ స్థానాలు పొందారు.రెసిడెన్షియల్* పాఠశాలల విభాగంలో ఎల్కతుర్తి మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు వి. సన్ షైన్ మరియు సిహెచ్. అక్షయ లు ప్రధమ, ద్వితీయ స్థానాలు గెలుపొందగా భీమదేవరపల్లి మండలం వంగర పివి రంగారావు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల చెందిన కె .సింధు తృతీయ స్థానాన్ని సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *