*ఉత్సాహంగా సాగిన ఆర్ టి డబ్ల్యూ ఏ వార్షిక సమావేశం*
హనుమకొండ జోర్దార్ విలేఖరి
హనుమకొండ పట్టణానికి చెందిన రెడ్డి టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పదకొండవ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని దేవన్నపేట పరిసరాల్లోని గుట్టల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించారు. క్రిక్కిరిసిన పట్టణ వాతావరణానికి దూరంగా, రోజువారి ఒత్తిడులను దూరం చేస్తూ కుటుంబ సభ్యులతో ఉపాధ్యాయులు ఉల్లాసభరిత వాతావరణంలో సమావేశం నిర్వహించారు.
దశాబ్ద కాలం క్రితం హనుమకొండ పట్టణంలో నివాసం ఉంటున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు ఉపాధ్యాయులు సంక్షేమం, రిక్రియేషన్ లక్ష్యంగా పొదుపు సంస్థను స్థాపించారు.
సంస్థ అధ్యక్షులు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ వార్షిక సమావేశంలో కోశాధికారి రమణారెడ్డి జమ, ఖర్చులతో కూడిన బ్యాలెన్స్ షీటును ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సభ్యులు నెలవారి పొదుపును రెట్టింపు చేయాలని , రిక్రియేషన్ కోసం కేటాయింపులను పెంచాలని సభ్యుల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు.
ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ పొందిన, పదోన్నతి పొందిన మరియు ప్రభుత్వం నుండి ఉత్తమ సేవా అవార్డు పొందిన సంస్థ సభ్యులను శాలువాలతో సత్కరించి పూల మొక్కలను బహుకరించారు.
సంస్థలోని మహిళ ఉపాధ్యాయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి చురుకుగా పాల్గొని ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. పత్తి పద్మా రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లల కోసం నిర్వహించిన వినోద క్రీడలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి నోముల శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పద్మారెడ్డి, ప్రసాద రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, వనజ ,గోపాల్ రెడ్డిలతో పాటు శ్రీలత, అమల, మమత, మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి , లక్ష్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply