Advertisement

పెద్దపల్లిలో బడిపంతుల్ల సైడ్ దందాలు

పెద్దపల్లిలో బడిపంతుల్ల సైడ్ దందాలు…

జిల్లా కలెక్టర్ విచారణకు ప్రజా సంఘాల డిమాండ్…

(9 డిసెంబర్ 2024, కరీంనగర్ జోర్దార్ నిఘా బృందం): ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా, జిల్లా కలెక్టర్ ఎంతో నిబద్ధత పనిచేస్తున్నా పెద్దపెల్లి జిల్లాలో బడిపంతులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. అదనపు ఆదాయం కోసం విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. సైడ్ దందాలతో అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. పిల్లలకు చదువు చెప్పకుండా బడులు మూతపడడానికి కారణం అవుతున్నారు. రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లాలోని బడి పంతుల సైడ్ దందాలపై చర్చ సాగుతుంది. బతకలేక బడి పంతులు అనేది ఒకనాటి మాట…. బడి పంతులు అయితే రెండు చేతులా సంపాదించ వచ్చు అనేది నేడు పెద్దపల్లి జిల్లాలోని కొందరు పంతుల్ల బాట…..తరగతి గదిని పవిత్ర ప్రయోగ శా గా మలచి విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పిస్తూ రేపటి భావిభారత పౌరులను అందిస్తూ సమాజం లో ఎంతో ఆదర్శంగా ఉండాల్సిన కొందరు ఉపాధ్యాయులు పెద్దపల్లి జిల్లలో అందుకు భిన్నంగా వ్యవహారిస్తున్నారు. ప్రభుత్వం నుండి లక్షలాది రూపాయల వేతనాలు పొందుతూ కూడా అత్యాశతో అక్రమాస్తుల సంపాదన ద్యేయంగా పలు రకాల వ్యాపారాలు చేస్తు కోట్లు సంపాదిస్తుంటే, మిగిలిన టీచర్లు తామెందుకు చదువు చెప్పాలనే ఆలోచనలో పడుతున్నారనే సమాచారం. జిల్లాలో సర్కార్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య ఘోరంగా పడిపోయింది. కారణాలు ఎన్నో ఉన్నా ఇక్కడ కొందరి టీచర్ల పనితీరు కూడా ఒక కారణం. కొందరు టీచర్ లు అసోసియేషన్ లు సేవా సంస్థల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు .ఇంకొందరు ఉపాధ్యాయులు రియలెస్టేట్, గొలుసు కట్టు వ్యాపారాలు, ప్రైవేట్ పాఠశాలలు, ఆసుపత్రులు, వాటర్ ప్లాంట్స్ లాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ప్రతి నెలా ప్రభుత్వ నుండి సక్రమంగా జీతాలు పొందుతూ అక్రమ బిజినెస్ లు చేయడం ఎంతవరకు సబబు అని పలు ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నారు.

పాఠశాల సమయంలో సెల్ ఫోన్ వాడరాధన్న నిబంధనలు గాలికి వదిలి తమ అక్రమ సంపాదన వ్యవహారాలు అన్నీ పాఠశాల సమయంలోనే పాఠాలు చెప్పకుండా చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని ప్రైవేటు వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొందరు తరగతి గదిలో పాఠాలకు పంగనామం పెడుతూ రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారాలను వాట్సాప్ గ్రూపులు ద్వారా యదేచ్చగా కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది. జిల్లా కలెక్టర్ విద్య కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పాఠశాలల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తూ విద్యార్థుల ప్రగతికి అత్యధికంగా కృషి చేస్తున్నారు. అయితే గ్రామస్థాయిలో పాఠశాల స్థాయిలో పర్యవేక్షణ క్షీణించడం వల్ల జిల్లాలో తగిన మానిటరింగ్ లేనందువల్ల బెల్ అండ్ బిల్లు లాగా విద్యా వ్యవస్థ మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అక్రమ సంపాదనకై తప్పుడు చర్యలకు పాల్పడుతున్న కొందరు ఉపాధ్యాయులపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. పెద్దపల్లి మండలం. పెద్దపెల్లి జిల్లా హెడ్ క్వార్టర్. రామగుండం. కమాన్పూర్ మంథని మండలాలతో పాటు మరికొన్ని మండలాల్లో ఉన్న టీచర్లు కూడా సైడ్ బిజినెస్లకు ఆసక్తి చూపుతున్నట్లు సామాజికవేత్తలు ఆరోపిస్తున్నారు.

ఇటీవల ఒక టీచర్ కి ఆన్లైన్ వ్యాపారంలో భారీ గిఫ్ట్ తగిలిన విషయంపై జిల్లాలో తీవ్రంగా చర్చ సాగుతుంది .జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి ఇతర వ్యాపకాలు చేస్తున్న వారిని కట్టడి చేయాలని పలు ప్రజా సంఘాలు కోరుతున్నారు. సరైన పర్యవేక్షణ లేనందు వల్లే సైడ్ దండాలు సాగుతున్నాయని సామాజికవేత్తలు ఆరోపిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *