Advertisement

కేయూలో గురువుకు‌ గుర్రపు బగ్గీపై ఊరేగింపు

గురుభక్తిని చాటిన శిష్య బృందం…

వరంగల్ జోర్థార్ ప్రతినిధి: శిష్యుల అభిమానం తమకు పాఠాలు చెప్పిన గురువుపై పూలవానై కురిసింది. తమకు పీజీలో పాఠాలు చెప్పిన, ఎంఫిల్, పీహెచ్‌డీ లో గైడ్ చేసిన ప్రొఫెసర్ ను ఉద్యోగ విరమణ సందర్భంగా వినూత్న రీతిలో వీడ్కోలు పలికారు. గుర్రపు బగ్గ ఊరేగించి గురుభక్తి చాటుకున్నారు. కాకతీయ యూనివర్శిటీ సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగంలో ప్రొఫెసర్ తౌటం శ్రీనివాస్ రిటైర్మెంట్ సందర్భంగా శుక్రవారం ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రొఫెసర్ శ్రీనివాస్ విద్యార్థులతో పాటు యూనివర్శిటీలోని తోటి అధ్యాపకులతో ఆప్యాయంగా ఉంటూ అందరి మన్ననలు పొందారు.ఉద్యోగ విరమణ సందర్భంగా శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న దంపతులను ఆయన శిష్యులు గుర్రపు బగ్గీపై యూనివర్సిటీ లో ఊరేగించారు. అడుగడుగునా వారిపై పూల వర్షం కురిపించారు. విద్యార్థులు అడి పాడారు.

1991లో సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వీధుల్లో చేరిన శ్రీనివాస్ అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ గా పని చేశారు. యూనివర్శిటీ ఎగ్జామినేషన్ అడిషనల్ కంట్రోలర్ గా, ఎన్ ఎస్ఎస్ యూనివర్శిటీ కోఆర్డినేటర్ గా, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ గా, సోషియాలజీ విభాగం హెడ్ గా, బీఓఎస్ గా పని చేశారు.

ఇదే సోషియాలజీ డిపార్ట్మెంట్ కు చెందిన ప్రొఫెసర్ రమేష్ వైస్ చాన్స్ లర్ గా పని చేసినప్పటికీ చివరలో అనేక అవినీతి ఆరోపణలు ‌ఎదుర్కొని, ఎలాంటి సన్మానాలు, సత్కారాలు లేకుండానే పదవీచ్యులయ్యారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎంక్వైరీ ఎదుర్కొంటున్నారు. ఒకే డిపార్ట్మెంట్ కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు భిన్నమైన పద్ధతుల్లో పదవీవిరమణ పొందడం యూనివర్సిటీ లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *