Advertisement

హిందువుల కోసం పోరాడినందుకు దేశద్రోహం కేసా…..

  • బంగ్లాదేశ్ లోని హిందూ ఆలయాలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి…..
  • హిందువుల కోసం పోరాడినందుకు దేశద్రోహం కేసా ….
  • హిందువులపై అరాచకాలను వెంటనే ఆపాలి….
  • భారత దేశ ప్రభుత్వం జోక్యం చేసుకొని బంగ్లా హిందువులను కాపాడాలి….
  • బంగ్లాదేశ్ ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ ను ఆ దేశ బహిష్కరణ చెయ్యాలి….
  • హిందూ ధర్మ పరిరక్షణ సమితి, వరంగల్ మహా నగర్ 

జోర్ధార్ వరంగల్ ప్రతినిధి:

బంగ్లాదేశ్ లో హిందువులపైన జరుగుతున్న దాడులకు మరియు ఇస్కాన్ స్వామి చిన్మయ కృష్ణదాస్ అరెస్టుకు నిరసనగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి, వరంగల్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఉదయం 11 గంటలకు స్తానిక వేయి స్తంబాల ఆలయం నుండి ప్రారంభమై హన్మకొండ పెట్రోల్ పంప్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన సభలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి బాధ్యులు ర్యాలీ కి వచ్చిన హిందువులను ఉద్దేశించి మాట్లాడారు.

సమితి అధ్యక్షులు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ లోని హిందువులపై గత కొంతకాలంగా అక్కడి ప్రభుత్వము అనేక రకాలుగా దాడులు జరుపుతుందని, అక్రమంగా అక్కడి హిందువులను అరెస్టులు చేసి చిత్ర హింసలు పెడుతున్నారని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చెసెలా భారత ప్రభుత్వము జోక్యం చేసుకోవాలని అన్నారు. 25 నవంబర్ 2024న ఇస్కాన్ సంస్థకు చెందిన కృష్ణదాస్ ప్రభును ఢాకాలోని షాహ్జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేయడం బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులపై చేసిన కుట్ర అని అన్నారు. కృష్ణదాస్ను అరెస్ట్ చేసిన అధికారులు ఇతర హిందూ సంఘాల ప్రతినిధులను కూడా అరెస్ట్ చేశారు, వారిని కూడా జైలుకు తరలించేందుకు చర్యలు తీసుకోవడం దారుణం అని అన్నారు.

బంగ్లాదేశ్ లోని ఫిరోజాబాద్లో లోకనాథ్ మందిరంపై దాడి….

బంగ్లాదేశ్ లోని ఫిరోజాబాద్లో లోక్నాథ్ మందిరంపై అక్కడి ప్రభుత్వ అండ దండలతో దాడి చేసి, ఆలయానికి నిప్పు అంటిచండం, మందిరంలో పూజలు చేసుకుంటున్న హిందువులను కొట్టి చిత్ర హింసలు పెట్టిన ఘటనలు మరవకముందే ఇస్కాన్ యొక్క చిన్మయ ప్రభును దేశద్రోహం ఆరోపణలతో అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఈ విధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించిన కారణంగా ఇస్కాన్ కు చెందిన చిన్మయ కృష్ణదాస్ ప్రభును ధాకాలోని హజ్రత్ షాజహన్లాల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అరెస్టు చేయడం మానవత్వాన్ని కాల దన్నడేమని అన్నారు. ఒకవైపు హిందువులను అక్రమంగా అరెస్టులు చేయడమే కాకుండా హిందూ బాలికలను ముస్లింలుగా మారుస్తున్నారన్నారు. బాగేరహాట్ జిల్లాలోని ఒక మైనర్ బాలిక రితు చక్రవర్తిను తొలుత జమాత్-ఏ-ఇస్లామీ పేరున్న ఉగ్రవాద సంస్థ సభ్యులు ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత బలవంతంగా మతమార్పిడి చేసి, ఆమెను ముస్లింగా మార్చారు. దేవాలయాల్లో చొరబడి తాళం పగలగొట్టి, ధనాన్ని దోచుకున్న సంఘటన కూడా బయట పడిందన్నారు. బంగ్లాదేశ్ లోని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ క్యాంపు సమీపంలోని మల్లికాపురాలో ముస్లిం దుండగులు ఒక విష్ణు మందిరంపై దాడి చేయడమే కాకుండా అక్కడున్న ధనాన్ని దోచుకుపోతుంటే బంగ్లాదేశ్ పోలీసులు మౌనంగా వుండి ప్రేక్షక పాత్ర పోషించడం సిగ్గు చేటని అన్నారు. బంగ్లాదేశ్ లోని ఉత్తర మాగురాలో అక్కడి దుండగులు కాళీమాత దేవాలయంపై దాడి చేసి పూజా వస్తువులను ధ్వంసం చేశారని, అంతేకాకుండా కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసారని అన్నారు. బంగ్లాదేశ్ లోని కిశోరగంజ్ లో 21 ఏళ్ల హిందూ యువకుడు హృదయ రవి దాస్ను తీవ్రంగా కొట్టి చంపడం దారుణం అని అన్నారు. నవంబర్ 15, 2024న హృదయ రవి ను బంగ్లాదేశ్ సైన్యం శిబిరానికి తీసుకెళ్లి చితకబాది చంపడం దారుణం అని అన్నారు.

హిందూ ఆలయ భూములను కాపాడాలి…..

బంగ్లాదేశ్ లోని సిల్హెట్ జిల్లాలో హిందువులపై దాడి ఘటన వెలుగు చూసిందని, అక్కడ దుండగులు ఆలయ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, దీని తరువాత, పూజారి మరియు సాధువులు నిరసన తెలపడంతో, అక్కడి అల్లరి మూకలు సాధువులను కొట్టడం హేయమయిన చర్య అని అన్నారు. బాగర్‌హాట్‌లో హిందూ ఉపాధ్యాయుడు మృణాల్ కాంతి చటోపాధ్యాయను బహిరంగంగా హత్య చేశారని, అతని భార్య షెఫాలీ ఛటర్జీని, కూతురు జుమా ఛటర్జీని కూడా వదలలేదని ప్రస్తుతం వారు బాగర్‌హాట్ జిల్లా ఆసుపత్రిలో ఇద్దరూ మృత్యువుతో పోరాడుతున్నారని అన్నారు. ఆగష్టు 5, 2024 న బంగ్లాదేశ్ లో జరిగిన హింసలో, కనీసం 27 జిల్లాల్లో హిందువుల ఇళ్లు మరియు దుకాణాలపై దాడి చేసి విధ్వంసం మరియు దహనానికి అక్కడి ప్రభుత్వం కారణమయిందని అన్నారు. బంగ్లాదేశ్ లోని లక్ష్మీపూర్‌లోని ఐక్య పరిషత్‌ సహాయ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గౌతమ్‌ మజుందార్‌ ఇంటికి 200-300 మంది అల్లరి మూకలు నిప్పుపెట్టాయి. బంగ్లాదేశ్‌లోని కొమిల్లా జిల్లాలో 135 ఏళ్ల చరిత్ర కలిగిన మహారాజా బీర్ చంద్ర లైబ్రరీని ధ్వంసం చేసి తగలబెట్టారు. లైబ్రరీలో చారిత్రక, సాంస్కృతిక మరియు పురాతన గ్రంథాలతో సహా 5,000 పుస్తకాలు ఉన్నాయని అన్నారు. ఆ తర్వాత అల్లర్లు లైబ్రరీని లక్ష్యంగా చేసుకున్నారు, లైబ్రరీలోని కొన్ని పుస్తకాలు 200 సంవత్సరాల కంటే పాతవని అన్నారు. బంగ్లాదేశ్ లో మీనా రాణి మరియు ఆమె కుమారుడు డాక్టర్ అనంత్ దాస్ అనే హిందూ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని గంగూటియా యూనియన్‌లోని బరాబరియా ప్రాంతంలో వారి ఇంటిని ధ్వంసం చేసి దాడి చేశారనీ, అతని ఇంటి వెలుపల ఉన్న ఆలయాన్ని కూడా దుండగులు ధ్వంసం చేశారని అన్నారు. బంగ్లాదేశ్ హింసాకాండలో, గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంట్లోకి ప్రవేశించి, మొదట అన్నింటినీ ధ్వంసం చేసి, ఆపై ఇంటికి నిప్పు పెట్టాడం దారుణం అని అన్నారు. గాయకుడు రాహుల్ ఆనంద్ కు చెందిన 3000 సంగీత వాయిద్యాలు కూడా మంటల్లో కాలి బూడిదయ్యాయి. గుంపును చూసిన సింగర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే తన కుటుంబంతో కలిసి ఇల్లు వదిలి రహస్య ప్రదేశంలో తలదాచుకోవాల్సి వచ్చిందని అన్నారు.

మెహర్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయంపై దాడి చేసిన ముస్లీం మూకలు…

బంగ్లాదేశ్ లోని మెహర్‌పూర్‌లోని మెహెర్‌పూర్‌లో ముస్లిం దుండగులు ప్రదర్శన పేరుతో ఇస్కాన్‌ ఆలయంపై దాడి చేశారు. ఈ దాడిలో జగన్నాథుడు, బలదేవ్, సుభద్రాదేవి విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఆలయ నిర్వాహకులు ముస్లిం గుంపు బారి నుంచి ముగ్గురు భక్తులను సురక్షితంగా రక్షించడం జరిగిందని అన్నారు. బంగ్లాదేశ్ లోని నార్సింగిలోని కాళీమాత ఆలయం మరియు కందిపరా జిల్లాలోని వరత్‌లోని కాళీ దేవాలయంపై ఇస్లామిక్ ఛాందసవాదుల దాడి చేయడం , ఆలయంలో ఉంచిన విగ్రహాలను పగులగొట్టి ఆలయంలో ఉంచిన కొన్ని విగ్రహాలను బయటకు విసిరేశారు. ఆలయ ద్వారం కూడా ధ్వంసమైందని అన్నారు. రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హిందువులను లక్ష్యంగా చేసుకున్నాయి మరియు రంగ్‌పూర్‌లోని ఇద్దరు హిందూ కౌన్సిలర్లు హరధన్ రాయ్ మరియు కాజల్ రాయ్ కాల్చి చంపబడ్డారు. ఈ కౌన్సిలర్లు ఇద్దరూ అధికార అవామీ లీగ్ పార్టీకి చెందినవారు. ఇటువంటి అనేక హిందూ వ్యతిరేక ఘటనలు బంగ్లాదేశ్ ప్రభుత్వం సాక్షిగా జరుగుతున్నాయి.

ఇస్కాన్ సభ్యులపై దాడులను ఖండించాలి….

హిందూ ధర్మ పరిరిక్షణ సమితి బాధ్యులు వెలగందుల రాజు, డా మంద శ్రీనివాస్ లు, జూలపల్లి కరుణాకర్ లు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సభ్యులతో సహా 19 మంది హిందువులపై దేశద్రోహం కేసు నమోదైంది. బాధితుల్లో ఇస్కాన్ డివిజనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ చందన్ కుమార్ ధర్, హిందూ జాగరణ్ మంచ్ కోఆర్డినేటర్ అజయ్ దత్తా ఉన్నారని అన్నారు. కదమ్ ముబారక్ ప్రాంతంలో 6 సెప్టెంబర్ 2024న గణేశ విగ్రహాన్ని మోసుకెళ్తున్న హిందూ భక్తుల ఊరేగింపుపై దాడి జరిగిందని దాడిలో ముగ్గురు హిందువులు మరణించారని అన్నారు. బటర్‌గాలి ధవపర సర్వజనిన్‌ పూజా సమితి సభ్యులు వ్యాన్‌లో హిందూ దేవతా విగ్రహాన్ని తీసుకువస్తుండగా, కదమ్ ముబారక్ మసీదు సమీపంలోని ఎత్తైన భవనం పైనుంచి గణేశుడి విగ్రహంపై, హిందూ భక్తులపై వేడినీళ్లు విసిరి అల్లరి సృష్టించడం దారుణం అని అన్నారు. ఇస్కాన్ కు చెందిన సన్యాసులపై బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

హిందువుల కోసం పోరాడినందుకు దేశద్రోహం కేసా…

హన్మకొండ ఇస్కాన్ సంస్థ బాధ్యులు భూపవన్ హరినాం దాస్ మాట్లాడుతూ, బౌద్ధ చక్మా మరియు హిందూ త్రిపురి సంఘాలపై దిగినలా మరియు ఖగ్రాచారి సదర్‌లో ముస్లిం గుంపులు దాడి చేశారని అంతేకాకుండా 200కు పైగా దుకాణాలు, మైనార్టీ వర్గాలకు చెందిన ఇళ్లకు నిప్పు పెట్టారు. ముస్లిం గుంపు బౌద్ధ దేవాలయంపై కూడా దాడి చేసి తగులబెట్టిందని అన్నారు. బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరాలోని జెషోరేశ్వరి కాళీ ఆలయానికి భారత ప్రధాని సమర్పించిన మా కాళీ కిరీటాన్ని పట్టపగలు అక్కడి దుండగులు దొంగిలించారని, 52 పీఠాలలో, ఈశ్వరీపూర్ ఆలయం సతీదేవి యొక్క అరచేతులు మరియు అరికాళ్ళు పడిపోయిన ప్రదేశం మరియు అమ్మవారు జశోరేశ్వరి దేవి రూపంలో కొలువై వున్న దేవాలయం లో ఇలా జరగడం దారుణం అని అన్నారు. హిందువుల కోసం పోరాడినందుకు దేశ ద్రోహం కేసా అని ప్రశ్నించారు. హిందువులపై కుట్రలు, దాడులకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ నేత మహ్మద్ యూనస్ కు లభించిన నోబుల్ శాంతి బహుమతిని రద్దు చేయాలని అన్నారు.

ఈ ర్యాలీలో ఇస్కాన్ సంస్థ సభ్యులు, అయ్యప్ప సేవా సమితి, హనుమాన్ సేవా సమితి, మార్వాడి సేవా సమితి, పతంజలి సంస్థ బాధ్యులు, వికాస తరంగిణి, ఇషా ఫౌండేషన్ బాధ్యులు, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాతంగి రమేష్ బాబు మరియు ఇతర సభ్యులు, హిందూ ధార్మిక సంస్థల నేతలు, దేవాలయ కమిటీలు, హరి హర క్షేత్రం బాధ్యులు 3000 కు పైగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *