కేయూ వీసీ, రిజిస్ట్రార్ల అభినందనలు….

మిమ్మల్ని స్టైలిష్‌గా మరియు సౌకర్యవంతంగా ఉంచడానికి రూపొందించబడిన మా ప్రత్యేకమైన దుస్తులు మరియు ఉపకరణాలతో మహిళల ఫ్యాషన్‌లో సరికొత్త వాటిని కనుగొనండి. చిక్ దుస్తులు మరియు సాధారణ దుస్తులు నుండి సొగసైన హ్యాండ్‌బ్యాగ్‌లు మరియు ఆభరణాల వరకు, మేము ప్రతి సందర్భానికి అనుగుణంగా అనేక రకాల ఉత్పత్తులను అందిస్తున్నాము. మీరు బోల్డ్ స్టేట్‌మెంట్ పీస్ లేదా టైమ్‌లెస్ క్లాసిక్‌ల కోసం చూస్తున్నా, మా సేకరణ ఆధునిక మహిళల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. మీ వ్యక్తిగత శైలిని మెరుగుపరచడానికి మరియు మీరు నమ్మకంగా మరియు ఆకర్షణీయంగా ఉండేలా చేయడానికి మా ఎంపిక చేసిన ఎంపికలతో ట్రెండ్‌ల కంటే ముందుండి.
కాకతీయ యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా. మామిడాల ఇస్తారికి భారత ప్రభుత్వం, పేటెంట్ కార్యాలయం “ప్రతి అనులేఖనాన్ని నిరోదించడంలో ఎక్లిప్టా ఆల్బా మొక్కల పాత్ర” పై పేటెంట్ ను జారీ చేసింది. డా ఇస్తారి పర్యవేక్షణలో గతంలో డా వెంకన్న లూనావత్ పీ.ఎచ్.డీ పూర్తీ చేశారు. పీ.ఎచ్.డీ పరిశోధనలో భాగంగా ఈ పరిశోధనలో గావించిన ఫలితాలను అక్టోబర్ 16, 2022 లో డా. ఇస్తారి పేటెంట్ హక్కుల కోసం భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయానికి దరఖాస్తు చేసారు. 2023 లో అప్లికేషన్ లో పొందుపరిచిన వివరాలను పరిశీలించిన అనంతరం ఈ మంగళవారం భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం నుండి ఈ పరిశోధనపై పేటెంట్ హక్కును పొందేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఈ మెయిల్ వచ్చింది. ఈ పేటెంట్ హక్కు 20 సంవత్సరాల వరకు ఉంటుందని పేటెంట్ అవార్డ్ సర్టిఫికేట్ మీద కూడా పొందుపరిచారు. డా. ఇస్తారి పర్యక్షణలో ఇప్పటి వరకు 12 మందికి పీ.ఎచ్.డీ పూర్తీ చేశారు. 120 కి పైగా పరిశోధనా పాత్రలను నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురించారు. యూజీసీ, డీ.ఎస్.టీ, డీ.బీ.టీ, టీ.ఎస్.కాస్ట్, ఐ.సి.ఎం.ఆర్ ల నుండి ఇప్పటి వరకు 8 పరిశోధనా ప్రాజెక్టులను పూర్తీ చేసారు. వివిధ అంశాలపై పీజీ మరియు పీ.ఎచ్.డీ విద్యార్థుల కొరకు 12 పుస్తకాలను రచించారు.
వీసీ ప్రో.ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ల అభినందనలు
ఈ సందర్భంగా డా మామిడాల ఇస్తారిని కేయూ వీసీ ప్రో. ప్రతాప్ రెడ్డి తన చాంబర్ లో పేటెంట్ సర్టిఫికేట్ అందచేస్తూ అభినందించారు. అకాడెమిక్ పరంగా పని చేసే వారికి ఇప్పుడూ యూనివర్సిటీ ప్రోత్సాహం ఇస్తుందని, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మంచి మంచి పరిశోధనలు చెయ్యాలని వీసీ అన్నారు. రిజిస్ట్రార్ ప్రో. మళ్ళా రెడ్డి తో పాటు, ప్రో. మల్లికార్జున్ రెడ్డి, ప్రో. నరసింహ చారి, జువాలజీ విభాగ ఆచార్యులు డా ఇస్తారిని అభినందించారు.
Leave a Reply