జాతీయస్థాయి క్రీడా పోటీలో పాల్గొన్న భీమదేవరపల్లి పాఠశాల మాజీ విద్యార్థి*
భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి
పంజాబ్ లూధియానాలోని గురునానక్ స్టేడియంలో నిర్వహిస్తున్న 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ పోటీలో భీమదేవరపల్లి ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థిని ఆయేషా సిద్ధిఖీ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ జూడో పోటీలో పాల్గొంది.
భీమదేవరపల్లి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ఆయేషా
హనుమకొండ లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని అండర్ 19 జూడో పోటీలో 57 కేజీల విభాగంలో నేడు అస్సాం లోని కేంద్రీయ విద్యాలయానికి చెందిన క్రీడాకారిణితో తలపడి ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. భీమదేవరపల్లి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ఆయేషా జూడో క్రీడలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి జాతీయస్థాయి పోటీలో ఉత్తమ ప్రదర్శన పట్ల పాఠశాల ఉపాధ్యాయులు మరియు పలువురు గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.

జూడో క్రీడలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన ఆయేషా సిద్ధిఖీ
ఈ పాఠశాలలో గణితం బోధిస్తున్న స్టాలిన్ బేగ్ కుమార్తె అయిన ఆయేషా జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడం పట్ల విద్యార్థిని తల్లిదండ్రులను పలు ఉపాధ్యాయ సంఘాలు అభినందించారు.
Leave a Reply