జువాలజీ లో కవితకు పీ.ఎచ్.డీ అవార్డు…
జోర్డార్ హన్మకొండ ప్రతినిధి, 24 మార్చి 2025: జంతు శాస్త్ర విభాగంలో ప్రో మామిడాల ఇస్తారి పర్యవేక్షణలో “ఎక్ష్ట్రక్షన్, ఐసోలేషన్ అండ్ క్యారక్టరైజేశన్ ఆఫ్ బయో యాక్టీవ్ ప్రిన్సిపుల్స్ ఫ్రం కేలట్రోపిస్ ప్రోసీరా రూట్ ఎక్ష్ట్రాక్ట్ అండ్ ఎవాల్యూయేషన్ ఆఫ్ ఇట్స్ యాంటి బ్యాక్టీరియల్ పొటేన్షియల్ అగైన్స్ట్ హ్యూమన్ పాతోజినిక్ బ్యాక్టీరియా” అనే అంశంపై పీ.ఎచ్.డీ పూర్తి చేసిన బూర్గుల కవితకు పీ.ఎచ్.డీ అవార్డు చేసినట్టు కేయూ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రో. కట్ల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం బూర్గుల కవిత ఎస్.ఆర్.అండ్ బీ.జీ.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే బూర్గుల కవితకు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం నుండి ఒక తన పరిశోధనపై ఒక పేటెంట్ కూడా పొందారు. ఈ సందర్భంగా కవితను కేయూ జంతు శాస్త్ర విభాగం ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.
Leave a Reply