(హనుమకొండ జోర్డర్ నిఘ విభాగం)
కాకతీయ యూనివర్సిటీలో బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం నియమించిన మాజీ వీసీ అనేక అక్రమాలకు పాల్పడి విజిలెన్స్ విచారణను ఎదుర్కొంటున్న విషయం మరవక ముందే అదే ప్రభుత్వంలో గతంలో ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ గా పని చేసిన ఓ అధికారి ప్రస్తుతం మళ్ళీ కేయూ లో బీ.ఆర్.ఎస్ లీడర్ సిఫార్సుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, ప్రస్తుత ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఫిర్యాదులు వెళ్లాయి.
అక్రమ ఫైల్ ఆమోదం కొరకు జోరుగా ప్రయత్నాలు?
నవంబర్ 9, 2021 లో కేయూలో పనిచేస్తున్న నలుగురు ప్రొఫెసర్ల కొరకు అప్పటి బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్.248 ను జారీ చేసింది. నలుగురు ప్రొఫెసర్ల సర్వీసును 2003 నుండి కొత్త సర్వేసుతో కలుపుకోవాలని మరియు పదోన్నతి బెనిఫిట్స్ తో పాటు ఇతర బెనిఫిట్స్ ను జీవో నెంబర్.208, 1999 జీవో ప్రకారం పొందేలా రిజిస్ట్రార్ కు అదేశిస్తున్నట్లు జీవో లో అప్పటి ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. జీవో నెంబర్.208, 1999 ప్రకారం పాత సర్వీసును కల్పుకోవాల్సిన అవసరం వస్తె కేవలం పదోన్నతి బెనిఫిట్స్ మాత్రమే పొందవచ్చని వుంది. కేయూలోని నలుగురు ప్రొఫెసర్లు 2021 లో తెచ్చుకున్న జీవో అమలు కావాలంటే పాలక మండలి సమావేశం జరిగి ఆమోదం పొందాలి. 18 నవంబర్ 2021 లో 136వ పాలక మండలి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు అప్పటి పాలక మండలి ఈ జీవో ను మార్చుకొని రమ్మని తీర్మానించింది. అంతే కాకుండా ఈ నలుగురు ప్రొఫెసర్లు కేవలం పదోన్నతి బెనిఫిట్స్ మాత్రమే పొందడానికి అర్హులని మరే ఇతర పాత పెన్షన్ లాంటి బెనిఫిట్స్ పొందడానికి అర్హులు కారని కూడా ఈసీ తీర్మానించింది. ఈ తీర్మానాలను దృష్టిలో పెట్టుకొని 22 మార్చి 2022 న అప్పటి రిజిస్ట్రార్ ప్రో. వెంకట్ రాం రెడ్డి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెల్తూ జీవో మోడిఫై కొరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి ఉత్తరం కూడా రాశారు. ఇలా ఈ విషయం ప్రభుత్వం వద్ద పెండింగ్లో వుండగా దానిని పక్కన పెట్టీ అక్రమ మార్గంలో బై సర్కులేషన్ లో అప్పటి ఈసీ తీర్మానాలను రివ్యూ చేస్తున్నట్లు, ఆ నలుగురు ప్రోఫెసర్లకు పాత పెన్షన్ విధానం అమలయ్యేలా గుట్టు చప్పుడు కాకుండా ఈసీ ఆమోదం కొరకు రంగం సిద్ధమైందని తెలిసింది. ఇప్పటికే పలువురు ఈసీ మెంబర్లతో ఆ ఫైల్ పై సంతకం పెట్టించినట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి ఆధీనంలో వున్న విద్యాశాఖలో కే.సీ.అర్ సన్నిహితుడీ హవా…?
ఈ అక్రమ ఫైల్ ఆమోదం చేయించడం వెనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అతి సన్నిహితుడు వరంగల్ కు చెందిన వారు ఒకరు వున్నట్లు సమాచారం. ఈ బీ.ఆర్.ఎస్ నాయకుడు, ఇన్చార్జి వీసీ ఒకే సామాజిక వర్గం కావడం, అప్పటి బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ప్రస్తుత ఇన్చార్జి వీసీ అప్పట్లో ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా పనిచేయడం గమనించదగ్గ విషయం. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పాత సర్వీసును కలుపుకొని పాత పెన్షన్ విధానం నలుగురు ప్రొఫెసర్లకు అమలు చేయడానికి సిద్ధం అయిన ఫైల్ పై కేయూ కు చెందిన ఒక ప్రొఫెసర్ సంతకం పెట్టడానికి మొదలు నిరాకరించినట్లు సమాచారం. ఈ ఫైల్ ఆమోదం కొరకు మరిన్ని డాక్యుమెంట్లు చూయించాల్సిందిగా కేయూ రిజిస్ట్రార్ ను అడగినట్లు సమాచారం. ఇన్చార్జి వీసీ ఫైల్ ఆమోదం కొరకు ఆ పాలకమండలి సభ్యుడికి స్వయంగా ఫోన్ చేసి దానిమీద సంతకం పెట్టే విషయంలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీనితో చేసేదేమీ లేక ఆ పాలక మండలి సభ్యుడు ఫైల్ పై సంతకం పెట్టినట్లు సమాచారం.
ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్న కేయూ అధికారులు
పాత సర్వీసును కొత్త సర్వీసుతో కలుపుకునే జీవో నెంబర్ 208, 1999 కేవలం పదోన్నతి బెనిఫిట్స్ మాత్రమే పొందాలని పేర్కొన్నది. అంతేకాకుండా ఈ పదోన్నతి బెనిఫిట్స్ పొందడానికి పాత సర్వీసు కు సంబంధించిన నియామకం వీసీ, రిజిస్ట్రార్, ప్రభుత్వ నామినీ, యూజీసీ నామినీ, ముగ్గురు సబ్జెక్ట్ ఎక్సపెర్ట్స్ లతో కూడిన సెలక్షన్ కమిటీ ద్వారా నియామకం జరిగి ఉండాలి. కానీ ఈ ప్రొఫెసర్ల పార్ట్ టైం లేదా అడ్హక్ నియామకం సెలక్షన్ కమిటీ ద్వారా జరగలేదని కేవలం హెడ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదం ద్వారా మాత్రమే జరిగిందని ఇటువంటి నియామకానికి సంబంధించిన సర్వీసును పాత సర్వీసుతో కలుపుకోవడానికి వీలులేదని ఈ జీవోలో ఉంది. అయినప్పటికీ కేయూ అధికారులు అప్పట్లో కొందరికి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి వారి సర్వీసును కొత్త సర్వీసుతో కలుపుకునేలా ఉత్తర్వులు జారీ చేసి ప్రభుత్వ ధన దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రయత్నం నలుగురు ప్రొఫెసర్లకు జరుగుతుందని సమాచారం. 2021 లో నిర్వహించిన 136వ పాలకమండలి సమావేశంలో ఈ నలుగురు ప్రొఫెసర్లకు కేవలం పదోన్నతికి సంబంధించిన బెనిఫిట్స్ మాత్రమే ఇవ్వాలని సూచించి, జీవోను మాడిఫై చేసుకోవాల్సిందిగా సూచించినప్పటికీ వీటన్నింటినీ పక్కనపెట్టి మళ్లీ పాలకమండలిలో రివ్యూ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం అని పలువురు అంటున్నారు. యూనివర్సిటీ ఉద్యోగుల జీతభత్యాల కొరకు నిధులు సరిగ్గా లేని ఈ సమయంలో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే ఈ అక్రమ విధానానికి స్వస్తి పలకాలని పలువురు ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు.
మౌనం వహిస్తున్న కేయూ ఈసీ సభ్యులు – అక్రమాలకు మేమూ సై.
గత మూడేళ్ళ కాలంలో ప్రో. తాటికొండ రమేష్ వీసీ గా వున్నప్పుడు అనేక అక్రమాలకు సంబంధించిన ఫైల్స్ పై పాలక మండలి సభ్యులు గుడ్డిగా సంతకం పెట్టి మాజీ వీసీ అవినీతిలో భాగస్వామ్యులు అయ్యారనే ఆరోపణలు వున్నాయి. ఇప్పటికే మాజీ వీసీ అవినీతి, అక్రమాలు, పాలక మండలి ఆమోదం పొందిన ఫైల్స్ వివరాలపై విజిలెన్స్ విచారణ జరుపుతున్న విషయం అందరికీ విదితమే. ప్రస్తుత కేయూ ఇన్చార్జి వీసీ వాకాటి కరుణ గతంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసింది. మాజీ విసి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పెట్టిన అనేక అక్రమాల ఫైలు పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమింపబడిన వాకాటి కరుణ గుడ్డిగా సంతకాలు చేసినట్టు సమాచారం. కాకతీయ యూనివర్సిటీ కి వాకాటి కరుణ ఇన్చార్జి వైస్ ఛాన్స్లర్గా నియామకం అయిన తర్వాత కేయూ లో పాలన సక్రమంగా జరుగుతుందన్న భావన అందరిలో కలిగింది కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కెసిఆర్ సన్నిహితుడైన వరంగల్ కు చెందిన ఒక లీడర్ సిఫార్సులతో కొన్ని అక్రమ ఫైల్లు ఆమోదం పొందేలా ఇన్చార్జి వేసి వాకాటి కరుణ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇన్చార్జి వేసి వాకాటి కరుణ అటువంటి ఫైల్స్ ఆమోదం కొరకు ఈసీ మెంబర్లకు సైతం ఫోన్లో మాట్లాడి ఫైల్ మీద సంతకం కొరకు ఒత్తిడి పెట్టినట్టు సమాచారం. దీంతో సదరు ఈసీ మెంబర్లు తప్పనిసరి ఆ ఫైల్ కు ఆమోదం పలకాల్సి వచ్చింది. ఈ ఫైల్ లో ఉన్న అక్రమ విధానాలపై ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరించినట్లయితే పాలకమండలి సభ్యులపై లేదా రిజిస్టార్ పై లేదా ఇన్చార్జి వీసి వాకాటి కరుణ పై చర్యలు తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఆ నలుగురు ప్రొఫెసర్లు ఈసీ మెంబర్లను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిసి ఆ అక్రమ ఫైల్స్ ఆమోదం కొరకు మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ ప్రభుత్వంలో వచ్చిన పాలక మండలి సభ్యులకు, గత ప్రభుత్వంలో వచ్చిన పాలకమండలి సభ్యులకు తేడా లేకుండా పోయిందని, అక్రమాలకు మేమూ సై అంటూ ముందుకు వెళ్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
I was everywhere sporadically and liing in and what are near to break its ruins And
I was everywhere sporadically and liing in and what are near to break its ruins And