తెలంగాణ బిజెపి అన్వేషణ ముమ్మరం
(కరీంనగర్ జోర్దార్ ప్రతినిధి): కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం తెలంగాణ బిజెపి అన్వేషణ ముమ్మరం. త్వరలో రానున్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి గెలవడం కోసం తెలంగాణ బిజెపి నాయకత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం నాలుగు జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్లను తమ వైపు తిప్పుకోవడం కోసం బిజెపి నాయకత్వం చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నది.
కరీంనగర్ స్థానం కోసం బిజెపి నాయకుడు సుగుణాకర్ రావు ప్రముఖ వైద్యులు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్, యువకులు, తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఆర్కే హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారి పేరును బిజెపి రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తన ప్రచారాన్ని ముమ్మరం చేసిన డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారికి రాష్ట్ర అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం రోజుల్లో బిజెపి అభ్యర్థిని ప్రకటించడం కోసం స్టేట్ కమిటీ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
Leave a Reply