
పిల్లలను చంపడమే డాక్టర్ దేవేందర్ రెడ్డి డ్యూటీయేనా.?
డాక్టర్ దేవేందర్ రెడ్డి నిర్లక్ష్యంతో బాలుడు బలి.
(జమ్మికుంట జోర్దార్ ప్రతినిధి):
ప్రాణాలు కాపాడవలసిన పిల్లల డాక్టర్ కట్కూరి దేవేందర్ రెడ్డి రోగుల ప్రాణాలు తీస్తున్నాడు అక్రమార్చన అలవాటు పడి రోగులకు అన్యాయం చేస్తున్నాడు ఒకప్పుడు పూటకు లేని డాక్టర్ జమ్మికుంటలో 30 కోట్ల రూపాయల విలువైన భవనాలను సంపాదించాడు సైకో డాక్టర్ గా పేరుపొందిన డాక్టర్ దేవేందర్ రెడ్డి వల్ల జమ్మికుంట ప్రాంతంలో ప్రజలు భయభ్రాంతులను వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన రియాన్స్11 నెలల బాబుకు వాంతులు జ్వరం రావడంతో తండ్రి నరేష్ సోమవారం రోజున వాత్సల్య హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది, డాక్టర్ కట్కూరి దేవేందర్ రెడ్డి పరీక్షించి నార్మల్ ఫివర్ అని చెప్పి బాలుడు ని ఒకరోజు అడ్మిట్ చేయమని సూచించడంతో బాలుని కుటుంబ సభ్యులు అడ్మిట్ చేయడం జరిగింది, నేడు డిఛార్జ్ చేస్తానని చెప్పడం జరిగింది రాత్రి కుటుంబ సభ్యులు సిబ్బందితో బాబు ఏడుస్తున్నాడు అని ఎంత చెప్పినా పట్టించుకోలేదు అని బాబుకు సీరియస్ కావడంతో డాక్టర్ సుమారు నాలుగు గంటల వ్యవధిలో వచ్చి వరంగల్ అమృత హాస్పిటల్ కి రిఫర్ చేయగా తీసుకువెళ్ళడం జరిగింది అమృత ఆసుపత్రికి చేరుకున్న తరువాత డాక్టర్ పరిశీలించి బాలుడు మృతి చెందాడు అని చెప్పడం జరిగింది. గంట ముందు తీసుకువస్తే బ్రతికేవాడు అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా వాత్సల్య హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతి చెందడం బాధాకరం గా కుటుంబ సభ్యులు భావించి తిరిగి హాస్పిటల్ వద్దకు మృతదేహాన్ని తీసుకువచ్చి ఆవేదనతో ఆందోళనకు దిగడం జరిగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జమ్మికుంట వాత్సల్య హాస్పిటల్ లో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న జమ్మికుంట పోలీసులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి కేసు నమోదు చేయమని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బంధువులు కుటుంబ సభ్యులు కోరారు వినాక మండలం నర్సింగపురం గ్రామానికి చెందిన డాక్టర్ కట్కూరి దేవేందర్ రెడ్డి వల్ల జమ్మికుంట ప్రాంతంలో వైద్య ప్రమాణాలు ఘోరంగా క్షీణించి పోయాయి జమ్మికుంటలో ఆరేళ్ల కాలంలో కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను సంపాదించి భారీ ఆసుపత్రిని కూడా దేవేందర్ రెడ్డి తన అక్రమాత్రులతో నిర్మిస్తున్నాడని రోగుల ఆరోపిస్తున్నారు వైద్య పరిజ్ఞానం లేని సైకో వైద్యుడైన దేవేందర్ రెడ్డి పై కేసు నమోదు చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జమ్మికుంట ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
Leave a Reply