మల్యాల ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
ఇల్లంతకుంట జోర్దార్ విలేఖరి
ఇల్లంతకుంట మండలం మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకున్నారు. మండల విద్యాధికారి కె రాములు ముఖ్యఅతిథిగా హాజరై పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. మహిళా ఉపాధ్యాయునిలు పద్మా రెడ్డి, రేష్మ ,ప్రణీత, అరుణ, రమాదేవి సరిత లను పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజయేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి ,రాజేష్ బాబు ,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply