*దర్గా ఉన్నత పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం*
హనుమకొండ జోర్దార్ ప్రతినిధి
కాజీపేట (జాగీర్), దర్గా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకొని అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ .యం.యం.స్వామి అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి డి.వాసంతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ.. విద్యార్థులు గణితాన్ని భయపడకుండా, సాధన చేస్తే సులభంగా అర్ధం అవుతుందని,గణిత నైపుణ్యాలలో రాణించినవారు అన్ని సబ్జెక్టులలో రాణిస్తారన్నారు. విద్యార్థులు శ్రీనివాస రామానుజంను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు తయారుచేసిన గణిత ఎగ్జిబిట్స్ ను తిలకించి, వారిని ప్రోత్సహించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఉత్తమ ఎగ్జిబిట్స్ ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో గణిత అష్టవదాని డా.అడ్లూరి నరసింహమూర్తి,పూర్వ కరీంనగర్ డీఈవో.యన్. రామేశ్వర్ రాజు లు పాల్గొని విద్యార్థులకు గణిత మెళకువలను తెలియజేసారు . నిత్యజీవితంలో మనం చేసే పనుల్లో గణితం ఉందని, వాటి ప్రక్రియలను మనకు తెలియకుండానే వాడుతున్నామని, వాటిని గుర్తించి విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తే ఎంతో రాణిస్తారన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, డీఎస్ఓ శ్రీనివాస స్వామి, హనుమకొండ జిల్లా గణిత ఫోరం అధ్యక్షులు తౌటం.భాస్కర్, పూర్వవిద్యార్థి కవి, రచయిత యస్. రాజమోహన్,పాఠశాల స్టాఫ్ సెక్రటరీ కె.శ్రీనివాస్, కాజీపేట మండలం గణిత ఫోరం అధ్యక్షులు బి.సతీష్ పాల్, గణిత ఉపాధ్యాయుడు ఎన్.రాజు,యుపిఎస్. ప్రధానో పాధ్యాయులు మగ్బుల్ హుస్సేన్ ఉపాధ్యాయులు యం. సుమలత,బి.సునీత, టి. రాంగోపాల్,వేణుగోపాల్ రెడ్డి,ఎస్.రాహుల్ , విద్యార్థులు పాల్గొన్నారు.
Leave a Reply