అమ్మవారి సన్నిధిలో ఎస్సీ- ఎస్టీ కమిషన్ చైర్మన్
*ముధోల్ జోర్ధార్ ప్రతినిధి*
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి చైర్మన్ మనుమడు శ్రీరామ దేవద్ర్ రెడ్డికి ఆలయ స్థానాచార్యులచే అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకర పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి గర్భాలయంలో అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, పోలీస్ సిబ్బంది, దేవస్థాన వైదిక పరిపాలన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply