Advertisement

రాష్ట్ర ఎన్.ఎచ్.ఆర్.సీ సభ్యులుగా ఎన్నికయిన రావుల రాజేశం

  • మానవ హక్కులను కాపాడాలి – రావుల రాజేశం
  • అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడమే ధ్యేయం……

హుజూరాబాద్ జోర్దార్ ప్రతినిధి:

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర సభ్యునిగా, ఇల్లంతకుంట మండలానికి చెందిన ప్రముఖ కవి, సాహితీవేత్త, సీనియర్ జర్నలిస్ట్, వ్యాసకర్త, అధ్యాపకులు అయిన రావుల రాజేశం నియమితులైనారు. ఈ నియామకానికి సంబంధించి ఉత్తర్వులను రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య మరియు ఉపాధ్యక్షులు సుంకనపల్లి రాము గురువారం హుజురాబాద్‌లో జరిగిన సమావేశంలో అందజేశారు. ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి ప్రణయ్ అధ్యక్షతన నిర్వహించబడింది.

సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, అవినీతి, అక్రమాలకు తావులేని సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు బాధ్యత గల పౌరుడిగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన పెంపొందించుకోవడం ముఖ్యమని, హక్కులకు భంగం కలిగినపుడు భారత రాజ్యాంగం చట్టాల ప్రకారం ప్రశ్నించే ధోరణి అలవాటు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది సుంకనపల్లి రాము, హనుమకొండ జిల్లా అధ్యక్షులు విస్సంపల్లి నాగేష్, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పులుగు లతా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

మానవ హక్కులను కాపాడాలి – రావుల రాజేశం

రాష్ట్ర ఎన్ హెచ్ ఆర్ సి సభ్యునిగా ఎన్నికైన రావుల రాజేశం మాట్లాడుతూ, “ఈ గొప్ప బాధ్యతను నా పై ఉంచి నన్ను విశ్వసించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మానవ హక్కుల పరిరక్షణ నా ప్రథమ కర్తవ్యం. సమాజంలో ప్రతి ఒక్కరికీ హక్కులు సమానంగా ఉండేలా మరియు వాటిని భంగం కలిగించే ఘటనలపై చట్టబద్ధంగా స్పందించడానికి నాకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తాను. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సమాజాన్ని నిర్మించడంలో నా వంతు కృషి చేస్తాను.

ప్రజల హక్కులపై అవగాహన పెంచడం, బాధ్యతగల పౌరులుగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించడం నా ముఖ్య లక్ష్యం. సమస్యల పరిష్కారానికి చట్టాలను పునాది చేసుకుని పని చేస్తాను. నేను నమ్మే విలువలు, నాకిచ్చిన ఈ బాధ్యత ప్రజల న్యాయం, సమానత్వం కోసం అంకితమై ఉంటుంది. అందరికీ ప్రాథమిక హక్కులు అందుబాటులో ఉండే సమాజాన్ని నిర్మించడంలో మీ సహకారాన్ని కోరుతున్నాను,” అని పేర్కొన్నారు. రాజేశం గారి మాటలు ఆహుతులకు ప్రేరణ కలిగించాయి.

ఈ నియామకంతో రావుల రాజేశం గారు రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణలో మరింత సేవలందిస్తారని అందరూ అభిప్రాయపడుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *