13 డిసెంబర్ 2024; జొర్ధార్ హన్మకొండ ప్రతినిధి:
హన్మకొండ లోని వివేకానంద యోగా కేంద్రంలో గురువారం రాత్రి 7 గంటలకు హిందుత్వం – సనాతనం, నిత్యనూతనం మరియు రాణి అహిల్యా భాయ్ హోల్కర్ పుస్తకావిష్కరణ, సమీక్ష కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి డాక్టర్ జగదీష్ అధ్యక్షత వహించగా, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రో. జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రో. ఎస్. జ్యోతి మాట్లాడుతూ, 18 వ శతాబ్దం లోనే రాణి అహిల్యా భాయ్ హోల్కర్ మహిళా సాధికారత గురించి పనిచేసిందన్నారు. అప్పటి సమాజంలో వున్న బాల్య వివాహాలను తప్పు పట్టి వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ సమాజాన్ని సంస్కరించే దిశలో పని చేసిన మహిళ హోల్కర్ అని అన్నారు.
హోల్కర్ గురుంచి సందేశమిస్తున్న కేయూ ప్రో. జ్యోతి
హాజరయిన సాహితీ వేత్తలు
సాంస్కృతిక వికాసాన్ని ఆవిష్కరించిన మహిళ హోల్కర్….
అతిథిగా పాల్గొన్న డాక్టర్ వడ్డీ విజయ సారధి మాట్లాడుతూ మొఘలుల అఘాయిత్యాలు జరుగుతున్న సమయంలో, దేవాలయాలు ధ్వంసం చేసినప్పుడు, విశ్వ విద్యాలయాలు విధ్వంసం చేస్తున్నప్పుడు, రామేశ్వరం నుండి మొదలుకొని 150 కి పైగా దేవాలయాలు, సత్రాలు తన స్వంత డబ్బుతో కట్టించి సాంస్కృతిక వికాసం కొరకు బ్రతికిన మహిళా హోల్కర్ అని అన్నారు. రెండు సంవత్సరాల కాలంలో 18 మంది కుటుంబ సభ్యులను హోల్కర్ కోల్పోయినప్పటికీ నిరుత్సాహ పడకుండా కుటుంబం అంటే నా దేశం అనుకుంది. తన కూతురికి ఓక యోధుడిని ఇచ్చి పెళ్లి చేసి దేశంలో సామాజిక సమరసతను ప్రాక్టికల్ గా చూయించిన మహిళ హోల్కర్ అని అన్నారు. భారత దేశం అంటే మూఢ నమ్మకాలు పాటించే మహిళలున్న దేశం అని అంటున్న సమయంలో రాణి ఆహిల్య మూఢ నమ్మకాలను నిర్మూలించే పని చేపట్టారు. భర్త చనిపోతే భార్యను దహనం చేసే దేశం, ఆడదంతే చదువుకు పనికి రాదు అన్న దేశం అని అంటున్న సమయంలో ఇటువంటి పరిస్థితి నుండి పూర్తిగా మార్చివేసే ప్రయత్నం చేసిన మహిళా అహళ్యాభాయి అని చెప్తూ అహల్యా భాయి హోల్కర్ జీవిత విశేషాలను వివరించారు.
ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించేదే హిందూత్వం…..
హిందూత్వం – సనాతనం, నిత్య నూతనం పుస్తకం గురుంచి ఆర్ ఎస్.ఎస్ ప్రచారక్ రాంపల్లి మల్లికార్జున్ మాట్లాడుతూ గడిచిన వేయి సంవత్సరాల బానిసత్వంలో మన దేశంలో పేరుకుపోయిన సమస్యలన్నింటికీ ఈ పుస్తకం సమాధానం అని అన్నారు. హిందూత్వం అనేది మతం కాదని, జీవన విధానమని అన్నారు. హిందూత్వం అనేది మతం అని మన మనసుల్లో ఎక్కించే కుట్ర ఈ దేశంలో జరుగుతుందని అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు మూల కారణం మతాల మధ్య వివిధ ఘర్షణలె అని చెప్పిన ప్రముఖుల మాటను గుర్తు చేసారు. ప్రపంచంలో మతసామరస్యం అవసరం. అన్నీ మతాలు వాళ్ళు వారి వారి మతాలే గొప్పవని అందరూ వాటినే అనుసరించాలని చెప్తున్నారని అన్నారు. ముస్లిం మతంలో అనేక విభజనలు జరిగి పాకిస్తాన్ లో ఈరోజు ఘర్షణలకు కారణమయ్యాయి. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం కేవలం భారతీయులతోనే జరుగుతుంది అన్నారు. రష్యా దేశంలో 15 జాతులు కొట్లాడుకొని 15 దేశాలుగా విడిపోయాయి. కానీ భారత్ లో వందల పైగా సంస్థానాలు వున్నా ఒక రిపబ్లిక్ దేశంగా అవతరించిందని అన్నారు.
మాట్లాడుతున్న వడ్డే విజయసారధీ
ప్రపంచంలో ఈరోజు అతిపెద్ద సమస్య పర్యావరణం. పర్యావరణాన్ని పరిరక్షించే మార్గాలు హిందూ ధర్మ శాస్త్రాల్లో కనబడుతాయి అని అన్నారు. పంచ భూతాలను సంరక్షిస్తే పర్యావరణం కాపాడబతుందని అన్నారు. కుటుంబంలో జరుగుతున్న కలహాలు మానాలంటే దానికి పరిష్కారం హిందూత్వం అని అన్నారు. అధర్వణ వేదంలోని భూమి సూక్తం లో సహోదర భావన ఎలా వుండాలో వివరణ వుంది అని అన్నారు. ఈ భూమి నా తల్లి, నేనామె పుత్రుడను అనే హిందూ ధర్మ శాత్రంలోని మాటలు మన దేశాన్ని ప్రభావితం చేశాయి. త్యాగం, సేవ అనే రెండు మార్గాలు ఈ దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తాయని అన్నారు. ధర్మబద్ధంగా జీవించే వ్యవస్థ హిందూత్వం నేర్పిస్తుందని అన్నారు.
పుస్తక సమీక్ష చేస్తున్న రాంపల్ల్లిమల్లికార్జున్
ఈ కార్యక్రమంలో సాహితీ వేత్తలు ఆచార్యసంజీవ, జాతీయ సాహిత్య పరిషత్ హనుమకొండ శాఖ ప్రధాన కార్యదర్శి తాడిచర్ల రవి, హనుమకొండ మహానగర ప్రచార ప్రముఖ్ మిట్టపల్లి వేణు, ఆర్ఎస్ఎస్ వరంగల్ విభాగ్ కార్యవాహ డాక్టర్ గద్దె రమేష్, ఇతర సాహితీ ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు.
Leave a Reply