భీమదేవరపల్లి లో ముగిసిన సీఎం కప్ క్రీడలు*
భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి దాకా క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ పోటీలు నేడు భీమదేవరపల్లి ఉన్నత పాఠశాల క్రీడామైదానం లో ముగిశాయి.
ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించిన క్రీడల చైర్మన్ మరియు మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు విజేతలకు మెడల్స్, షీల్డ్లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. విజేతలు రాష్ట్రస్థాయిలో రాణించాలని కోరారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముల్కనూరు ఎస్సై సాయిబాబా మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దారుడ్యాన్ని పెంచడమే కాకుండా మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని పెంపొందిస్తుందన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు టీ షర్టులు అందజేస్తానని హామీ ఇచ్చారు.
స్థానిక కాంగ్రెస్ నాయకులు చిట్టంపల్లి ఐలయ్య మరియు కొలుగూరి రాజులు క్రీడాకారులకు ఆహారం తదితర సదుపాయాలను కల్పించారు. మండలంలోని అనేక గ్రామాల నుండి విద్యార్థులు,మహిళలు, యువకులు పెద్ద ఎత్తున క్రీడామైదానికి చేరుకొని రెండు రోజులపాటు ఆసక్తికరంగా సాగిన పోటీలను తిలకించారు. మండలంలోని వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు తీవ్రంగా శ్రమించి అత్యంత క్రమశిక్షణతో ఈ పోటీలు నిర్వహించడం తో పలువురు వారిని ప్రశంసించారు.
వంగర పిహెచ్సి వైద్య అధికారులు రెహమాన్ మరియు ఏఎన్ఎం స్వరూప, శ్యామల క్రీడా మైదానంలో అందించిన వైద్య సేవలు పట్ల నిర్వాహకులు అభినందించి సత్కరించారు. ఈ పోటీలలో మండల స్థాయిలో విజేతలుగా నిలిచి జిల్లా స్థాయి లో పాల్గొంటున్న జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కబడ్డీ(పురుషులు) పోటీలో గట్ల నర్సింగాపూర్ ప్రథమ కొత్తకొండ ద్వితీయ స్థానంలో మహిళ విభాగంలో భీమదేవరపల్లి ప్రథమ స్థానం కొత్తపల్లి ద్వితీయ స్థానంలో నిలిచారు. కోకో పోటీలో పురుషుల విభాగంలో కొప్పూరు ప్రథమ, సాయి నగర్ ద్వితీయ స్థానంలో మహిళా విభాగంలో వంగర ప్రధమ, ఎర్రబెల్లి ద్వితీయ స్థానంలో నిలిచాయి. వాలీబాల్ పోటీలో పురుషుల విభాగంలో ముల్కనూర్ ప్రధమ, రత్నగిరి ద్వితీయ మరియు మహిళా విభాగంలో భీమదేవరపల్లి ప్రధమ, కొత్తకొండ ద్వితీయ స్థానాల్లో గెలిచాయి.
విజేతలను ముఖ్య అతిథులు అభినందించి బహుమతులు అందజేశారు. సీఎం కప్పు ముగింపు కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎస్సై సాయిబాబా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఎంఈఓ సునీత రాణి ,ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ రాజేశ్వరి, క్రీడా నిర్వాహకుడు మోహన్, సీనియర్ క్రీడాకారుడు శ్రీనివాస్ లతో పాటు వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు అనిత ,స్వప్న, కమలాకర్ , చంటి, శారద, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply