Advertisement

అబద్ధాలు ఆడటంలో రేవంత్ రెడ్డికి పి.హెచ్.డి తో పాటు డాక్టరేట్ ఇవ్వచ్చు…

కూలిపోయిందన్న కాలేశ్వరమే కాంగ్రెస్ కు దీపం అయ్యింది..
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

(హుజురాబాద్ జోర్దార్ నిఘా-పడాల రమేష్): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అబద్ధాలు ఆడటంలో పీహెచ్ డి తో పాటు డాక్టరేట్ ఇవ్వచ్చని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవ చేశారు. ఆదివారం హుజురాబాద్ సిటీ సెంటర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు తప్పా నిజాలు రావడంలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను వంద రోజులలో అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా పూర్తి చేయలేదని అన్నారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో మహారాష్ట్రలో అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే గుణపాఠం చెప్పారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసిన విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు గమనించారని అన్నారు. ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి వెళ్లిన అక్కడ సభలో దేవుళ్ళ మీద ఓట్లు వేస్తూ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అటు దేవుళ్ళను మోసం చేశారని, దేవుళ్ళ మీద ఒట్లు వేసి మోసం చేసిన ముఖ్యమంత్రి కి ప్రజలను మోసం చేయడం పెద్ద పనేమీ కాదన్నారు. 19జులై 2024 ఫార్మా సిటీ కి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ఏర్పాటు అని ఇలా చెబుతారని అన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేసే ప్రాంతంలో గుడ్లు పెట్టని ప్రదేశమని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు పచ్చి అబద్ధమని, రైతులు స్వయంగా అక్కడ పచ్చని పొలాలు చూపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే ఫార్మసిటిని రద్దుచేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటుచేసిన దళిత బంధు పథకం ద్వారా ఎంతోమంది దళితులు ఉన్నత స్థాయికి ఎదిగారని, రెండో విడత దళిత బందుపై కూడా ఫ్రీజింగ్ ఎత్తివేసి వెంటనే వారి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత బంధు కోసం హుజురాబాద్ లో ధర్నాకు దిగిన దళిత కుటుంబాలను అక్రమంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే అరెస్టులను ఆపివేసి దళిత బంధు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలు దళితులకు అండగా ఉంటూ వారి సమస్యలపై నిలదీస్తామని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే ఆడ్ గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,

తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాజీ చైర్మన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *