జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలి: డీఈవో రాజేందర్
భూపాల్ పల్లి జోర్దార్ ప్రతినిధి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శాంతినికేతన్ (పాత గుడ్ మార్నింగ్ ) హైస్కూల్లో డిసెంబర్ 7, 8వ తేదీల్లో నిర్వహించతలపెట్టిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ పేర్కొన్నారు.శాంతి నికేతన్ హైస్కూల్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం కోసం ఏర్పాటు చేసిన సన్నాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..ఆయా కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులు అందరూ సకాలంలో విచ్చేసి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసి మన జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలపాలని పేర్కొన్నారు. కన్వీనర్లు, కో కన్వీనర్లు సభ్యులు సకాలంలో విచ్చేసి తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి స్తాయిలో నెరవేర్చాలని తెలిపారు. వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించడానికి వచ్చే విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఈ ప్రారంభ సమావేశానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశం లో అకడమిక్ మానిటరింగ్ అధికారి కాగితపు లక్ష్మణ్ జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, రాజగోపాల్, మందల రవీందర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ రాజేష్ , శనిగరపు భద్రయ్య, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు కన్వీనర్లు, కోకన్వీనర్లు సభ్యులు పాల్గొన్నారు.
Leave a Reply