Advertisement

ఆప్తాల్మీక్ అధికారి రూటే సపరేట్

డ్యూటీ లకు వెళ్ళ కుండానే నెల నెల జీతం

కంటి వెలుగు ప్రోగ్రాం లో వచ్చిన మెటీరియల్ సొంత షాప్ లోకి

ధర్మసాగర్ పి.హెచ్. సి లో పని చేయాల్సిన ఓ అధికారి ఏకంగా హన్మకొండ డి.యం.హెచ్.ఓ లో అధికారికి పి. ఏ గా చెప్పుకుని నిరుద్యోగులకు ఫోన్స్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని ఒక్కొక్కరి వద్ద లక్షల్లో వసూళ్లు చేసిన విషయం బహిరంగ రహస్యం. డాక్టర్స్, పారామెడికల్ ఉద్యోగాలు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా నే, ఎటువంటి మెరిట్ కూడా లేకుండా నే దొంగ చాటుగా పోస్టింగ్స్ ఇప్పిస్తా అని లక్ష ల్లో వసూళ్లు చేసి తన అప్పులన్నీ కట్టుకున్నాడని ఉద్యోగులు గుస గుస లాడుకుంటున్నారు.ఇప్పటికీ చాలా మందికి డబ్బులు తిరిగి ఇవ్వలేదు.

కంటి వెలుగు ప్రోగ్రాం లో కూడా ఏ. ఆర్ మిషన్స్, మరియు ఇతర ఐటమ్స్ తక్కువ ధరకు కొని ఎక్కువ రేట్ కు బిల్లులు పెట్టి పెద్ద ఎత్తున దండు కున్నాడని ఇప్పుడు ఏకంగా హన్మకొండ చౌరస్తా లో పెద్ద ఆప్టికల్ షాప్ కూడా ఓపెన్ చేసాడని ఏ ఒక్క రోజు విధులకు వేళ్ళకున్న కూడా ప్రతీ నెల సక్రమంగా జీతాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇతడి అవినీతి అక్రమాల పై విజిలెన్స్ అధికారులతో ఎంక్వయిరీ చేయించి జిల్లా కలెక్టర్ మరియు ఉన్నాతాదికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *