Advertisement

అరెస్టు చేసిన ఎమ్మెల్యే లను విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకుల ధర్నా

*అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా*

(వీణవంక జోర్దార్ విలేకరి)

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి పోలీసులు భారీగా మోహరించి కౌశిక్ రెడ్డి ని మరియు హరీష్ రావును,జగదీశ్వర్ రెడ్డి నీ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారని తెలియడంతో అక్రమ అరెస్టులను నిరసిస్తూ వీణవంక మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటంను దహనం చేసి ధర్నా చేశారు. దీంతో పోలీసులు వారిని నివారించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి,మాజీ జడ్పీటీసీ వనమాల సాధవరెడ్డి,సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి,ఉప సర్పంచ్ వోరెం భాన్ చందర్, మండల టౌన్ ప్రెసిడెంట్ తాల్లపెల్లి మహేష్,పలువురు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంత పాలన నడుస్తుందని ఆరోపించారు.తన ఫోన్ టాపింగ్ జరుగుతుందంటూ పిటిషన్ ఇవ్వడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కౌశిక్ రెడ్డి ఫిర్యాదు తీసుకోకుండా తిరిగి అతనిపైనే కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుకలైన కౌశిక్ రెడ్డి, హరీష్ రావు లను అరెస్టు చేసి గొంతు నొక్కి ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి తీరును ప్రజలంతా గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా గుణపాఠం చెబుతారన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలును పక్కకు పెట్టి ఆరు గ్యారంటీల అమలు కోసం పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. తక్షణమే అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఎండి యాసిన్, దాసారపు కృష్ణచైతన్య,మర్రి రవి,రాజు, ఓరెం రవి, వేణు రవి,కుమరస్వామి తదితరుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *